అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీలోని 31వ వార్డులో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారం నిర్వహించారు. వామపక్ష పార్టీలు బంద్కు పిలుపునిచ్చిన తరుణంలో 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అంటూ నినాదాలతో హోరెత్తించారు. వైకాపా ప్రభుత్వాన్ని ఎండగడుతూ.. తెదేపా హయాంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు.
'వైకాపాకు అవకాశమిస్తే పంచభూతాలను అమ్మేస్తుంది' - mla balakrishna latest news
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారం చేపట్టారు. అధికార పార్టీ వైఖరిని విమర్శిస్తూ.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
అవకాశమిస్తే పంచభూతాలను అమ్ముకునే ప్రయత్నం చేస్తారని అధికార పార్టీ వైఖరిని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలందరూ మేల్కొని మున్సిపల్ ఎన్నికల్లో తెదేపాను గెలిపించి.. వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.