కార్తీకమాసం సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ... నిర్వహిస్తోన్న దీపోత్సవానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా హిందూపురంలో కోటి దీపోత్సవం నిర్వహించడానికి బాలయ్య సిద్ధమయ్యారు. ఇందుకోసం బాలయ్య సతీమణి వసుంధర, సోదరి లోకేశ్వరి హిందూపురంలోని మహిళలకు ఆహ్వానం పలికారు. తమకు సొంత ప్రాంతంగా భావించే హిందూపురంలోని ఆడపడుచుల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించాలని బాలయ్య భావించారని... మహిళలు భారీగా పాల్గొని జయప్రదం చేయాలని వసుంధర కోరారు.
కోటి దీపోత్సవం జయపద్రం చేయండి: నందమూరి వసుంధర - హిందూపురంలో కోటి దీపోత్సవం వార్తలు
కార్తీకమాసం సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్వహిస్తున్న... కార్తీక దీపోత్సవాన్ని జయప్రదం చేయాలని ఆయన సతీమణి వసుంధర కోరారు. పట్టణంలోని పలు వార్డుల్లో స్వయంగా తానే మహిళలకు బొట్టుపెట్టి ఆహ్వానించారు.
mla-balakrishna-wife-invits-for-kartheeka-deepam-celebrations-at-hindupuram