అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna)... కరోనాతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న నియోజకవర్గ ప్రజల కోసం రూ.మూడు లక్షలు విలువ చేసే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపారు. అవసరమైన వారు ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదిస్తే... స్వయంగా ఓ టెక్నీషియన్ సహాయంతో వారికి వైద్య సేవలు అందిస్తామని తెదేపా నాయకులు తెలిపారు. నియోజకవర్గంలో ఏ అవసరం ఉన్నా అందించేందుకు బాలకృష్ణ సిద్ధంగా ఉన్నారని నాయకులు తెలిపారు. కరోనా సమయంలో ఇప్పటికే రెండు దఫాలుగా సహాయం అందించారని నేతలు కొనియాడారు.
Balakrishna: హిందూపురానికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిన ఎమ్మెల్యే బాలకృష్ణ - అనంతపురం జిల్లా వార్తలు
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కరోనా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారి కోసం రూ.3 లక్షలు విలువ చేసే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపారు. అవసరమైన వారు హిందూపురం ఎమ్మెల్యే కార్యాలయంలో సంప్రదించాలని తెదేపా నాయకులు తెలిపారు.
ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు