అనంతపురం జిల్లాలోపోలీసు బందోబస్తు పర్యవేక్షణలో ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ చేపట్టారు వ్యవసాయ అధికార్లు.మడకశిర మండలం ఎమ్మార్వో కార్యాలయం వద్ద విత్తనాల కోసం తెల్లవారక ముందే రైతులు బారులు తీరారు.క్యూలైన్లో నిల్చున్న రైతులకు,వ్యవసాయ అధికార్లకు కొన్ని సందర్భాల్లో గొడవలు చోటు చేసుకుంటున్నాయి.వ్యవసాయ అధికారి ఏ.వో.గోపాల్ తనను కొట్టాడంటూ,ఓ రైతు పోలీసులకు ఫిర్యాదుచేశారు.తాను ఎవరిని కొట్టలేదని వ్యవసాయ అధికారి అనండంతో..ఇద్దరికి నచ్చజెప్పి,రైతుకు విత్తనాలు ఇప్పించి పంపించివేశారు పోలీసులు.
ఇదీ చూడండి
అనంతలో పోలీసుల పర్యవేక్షణలో విత్తన పంపిణీ
ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ పంటల విత్తనాల పంపిణీలో వ్యవసాయ అధికార్లకు,రైతులకు వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. మడకశిర విత్తన పంపిణీ కేంద్రంలో పోలీసులు రంగ ప్రవేశంతో విత్తన పంపిణీ కార్యక్రమం సాపీగా జరుగుతోంది.
రైతు కొట్టాడంటాడు... అధికారి ఓట్టు అంటాడు