Minister Usha Sri Charan: రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ వర్షానికి ఆదమరిచి ఆటలాడారు... మహిళలతో కలిసి నృత్యం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మానిరేవు పంచాయితీలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉష శ్రీ చరణ్... వర్షం పడుతున్న సమయంలో అక్కడున్న కొంతమంది మహిళా మిత్రులతో కలిసి నృత్యం చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
వర్షంలో మంత్రి ఉషశ్రీ చరణ్ డ్యాన్స్... వీడియో వైరల్ - అనంతపురం జిల్లాలో మంత్రి ఉషశ్రీ చరణ్ వర్షం నృత్యం
Minister Usha Sri Charan: కటిక పేదోడైనా... కోట్లకు అధిపతైనా ప్రకృతికి పరవశించాల్సిందే... ఆ ప్రకృతి అందం, ఔదార్యం అలాంటిది మరి... సమస్త జీవకోటి దానికి దాసోహం... ఆ సోయగాలు అందరినీ ఆకట్టుకుంటాయి... అందులోని మార్పులు జీవులను ఉవ్విళ్లూరిస్తాయి.... ఉరకేలేయిస్తాయి... అందుకే మంత్రి హోదాలో ఉన్న మహిళ... అన్ని మరిచిపోయి ప్రకృతి కురిపించిన వర్షానికి మైమరిచిపోయి నాట్యమాడింది... వర్షంలో మరికొంతమంది మహిళలతో కలిసి చిందులేసింది. ఆమె ఎవరో కాదు... రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్
మంత్రి ఉష శ్రీ చరణ్
Last Updated : May 19, 2022, 2:40 PM IST