వైకాపా అధికారంలో ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని రహదారులు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. మంగళవారం సోమందేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆసరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మొదట డ్వాక్రా మహిళలతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైకాపా అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. వైకాపాతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని వివరించారు.