MINISTER PEDDIREDDY : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. 2019 ఎన్నికల కంటే అత్యధిక స్థానాల్లో గెలుపొందాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో నలుగురు ప్రాంతీయ సమన్వయకర్తలను ఎంపిక చేసి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించి వారి ద్వారా పార్టీ కార్యక్రమాలు సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తాం: మంత్రి పెద్దిరెడ్డి - ఏపీ తాజా వార్తలు
MINISTER PEDDIREDDY ON ELECTIONS: గత ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి.. అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తామని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
MINISTER PEDDIREDDY ON ELECTIONS
బీసీలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశాడని.. ఎన్నికల ముందు చంద్రబాబునాయుడుకు బీసీలపై ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించి అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలిచేందుకు పార్టీ నాయకులంతా కృషిచేసి ఆ దిశగా పని చేస్తామని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: