జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి కుళాయి నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌తో పాటు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తాగు, సాగునీటి సమస్యలకు సంబంధించిన పలు అంశాలను సమావేశంలో చర్చించారు.
'జల్ జీవన్ మిషన్ పథకం' ద్వారా ఇంటింటికి కుళాయి నీరు: మంత్రి పెద్దిరెడ్డి
అనంతపురం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి కుళాయి నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు.
ఇటీవల అనంతపురం రూరల్ కక్కలపల్లి కాలనీలో ఖాళీ బిందెలతో మహిళలు సచివాలయాన్ని ముట్టడించారని రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి ప్రస్తావించారు. గతంలో తాము తాగునీటి సమస్య కోసం ఆ ప్రాంత ప్రజలతో కలిసి నిరసనలు చేశామని గుర్తు చేశారు. రాయదుర్గం ప్రాంతంలో ఉన్న నీటి ప్రాజెక్టులకు మరమ్మతులు చేసి నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని కాపు రామచంద్రారెడ్డి మంత్రిని కోరారు. గుంతకల్ ప్రాంతంలో అత్యధిక చెరువులు ఉన్నాయని.., వాటిలో నీరు నిల్వ ఉండేలా చూడాలని ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మంత్రిని కోరారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్న మంత్రి పెద్దిరెడ్డి.. అధికారులకు పలు సూచనలు చేశారు.
ఇవీ చూడండి