అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా నేతల ఆగడాలు శ్రుతి మించుతున్నాయని మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. తమ ఏజెంట్లను కనీసం పోలింగ్ కేంద్రానికీ అనుమతించటం లేదని.. అదే సమయంలో వైకాపా వారిని మాత్రం అనుమతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలు, నేతలు, అభిమానులపై దాడులు జరుగుతున్నా పోలీసులు, అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఈవీఎంలు చాలా చోట్ల పని చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు మండలాల్లో మహిళలకు, వృద్ధులకు కనీస సౌకర్యలు సైతం కల్పించలేదని ఆక్షేపించారు. మరోసారి రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు.
రీ పోలింగ్ జరపాల్సిందే: మంత్రి పరిటాల సునీత
తమ కార్యకర్తలు, నేతలపై వైకాపా నేతలు దాడులు చేస్తున్నా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. చాలా చోట్ల ఈవీఎంలు పని చేయలేదని... రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు.
రీపోలింగ్ జరపాలని మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు.