అనంతపురంలో జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన కొవిడ్ ఆస్పత్రిని జిల్లా ఇన్ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆస్పత్రిలో 300 పడకలు, ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేశారని చెప్పారు. కొవిడ్ బాధితులకు సేవలందించేందుకు 20రోజుల్లోనే ఆస్పత్రిని సిద్ధం చేసిన జిల్లా అధికారులను మంత్రి అభినందించారు.
అనంతపురంలో కొవిడ్ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి బొత్స
అనంతపురం జిల్లాలో జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన కొవిడ్ ఆస్పత్రిని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇరవై రోజుల్లోనే ఆస్పత్రిని నిర్మించేందుకు కృషి చేసిన జిల్లా అధికారులను ఆయన అభినందించారు.
వర్చువల్ విధానంలో ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి బొత్స నారాయణ
సీఎం జగన్ చేతుల మీదుగా త్వరలో తాడిపత్రిలో 500 పడకల ఆస్పత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆక్సిజన్ బెడ్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రైవేటు కంటే ప్రభుత్వ సేవలు మిన్న అనేట్లుగా వైద్య సేవలు విస్తరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి ఎం.శంకరనారాయణ, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.