ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అనంతపురం మేయర్ పదవి ముస్లిం మైనార్టీలకు ఇవ్వాలని నిర్ణయించాం' - ap municipal elections latest news

అనంతపురం మేయర్‌ పదవిని ముస్లిం మైనార్టీ వర్గానికి, డిప్యూటీ మేయర్​ పదవిని కాపు సామాజిక వర్గానికి కేటాయించనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో పురపాలక ఛైర్మన్‌లు, డిప్యూటీ ఛైర్మన్‌ల ఎంపికపై.. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో సమావేశం నిర్వహించారు. తాడిపత్రిలో ఎవరిని ప్రలోభాలు పెట్టడం లేదని స్పష్టం చేశారు

minister botsa sathyanarayana on ananthapuram mayor seat
minister botsa sathyanarayana on ananthapuram mayor seat

By

Published : Mar 17, 2021, 3:36 PM IST

అనంతపురం నగర మేయర్ అభ్యర్థి పదవి ముస్లిం మైనార్టీలకు, డిప్యూటీ మేయర్ పదవి కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్లు జిల్లా ఇన్​ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అనంతపురంలో పది మున్సిపాలిటీల ఛైర్మన్లు, నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఖరారు చేయడానికి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు.

మంత్రి బొత్స సత్యనారాయణ

అనంతపురం జిల్లాలో 10 పురపాలికలకు ఛైర్మన్లను నిర్ణయించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తాడిపత్రిలో ఎవరిని ప్రలోభాలు పెట్టడం లేదని స్పష్టం చేశారు.

నూతన కార్యవర్గం కొలువుదీరాక 15 శాతం ఆస్తిపన్ను పెంచేలా అనుమతించినట్లు బొత్స స్పష్టం చేశారు. 330 చదరపు అడుగుల ఇంటికి ఆస్తిపన్ను రూ.50 మాత్రమే ఉంటుందన్నారు. అనంతపురంలో గెలుపొందిన 48 మంది కార్పొరేటర్లతో బొత్స సమావేశం నిర్వహించి.. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి: రసవత్తరం.. తాడిపత్రి ఛైర్మన్ ఎన్నిక వ్యవహారం

ABOUT THE AUTHOR

...view details