పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా ఇన్ ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాకు వచ్చారు. పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కదిరి డివిజన్ పంచాయతీ ఎన్నికలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మరో మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, సిద్ధారెడ్డి కేతిరెడ్డి , వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. జిల్లా నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
అనంతపురం జిల్లాకు బొత్స.. పంచాయతీ ఎన్నికలపై చర్చ - అనంతపురంలో బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ అనంతపురం జిల్లాలో పర్యటించారు. పుట్టపర్తి ఎమ్మెల్యే కార్యాలయంలో కదిరి డివిజన్ పంచాయతీ ఎన్నికలపై వైకాపా నాయకులతో కలిసి చర్చించారు.
అనంతపురం జిల్లాకు బొత్స.. పంచాయతీ ఎన్నికలపై చర్చ