మినీ బస్సు బోల్తా.. ముగ్గురు మృతి.. - Anantapur district road accident news
06:12 February 20
మరో 12 మందికి గాయాలు
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద మినీబస్సు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు ప్రమాద స్థలిలోనే మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.మృతులు బాగాదమ్మ, దళపతి, ఈశ్వర్గా గుర్తించారు. తిరుమల నుంచి పులగంపల్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మినీ బస్సులో 25 మంది కుటుంబసభ్యులు తిరుమలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కదిరిలో 10 మంది సభ్యులు దిగిపోయారు. మరో 15 మందితో స్వగ్రామం పులగంపల్లి వెళ్తుండగా.... గ్రామ సమీపంలోనే ప్రమాదం జరిగింది. మరి కొన్ని నిమిషాల్లో ఇళ్లకు చేరుకుంటారనగా.... ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం.... ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. సిమెంట్ లారీని అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి బోల్తా పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి :Accident: కాసేపట్లో పెళ్లి.. అంతలోనే ఊహించని విషాదం !