అనంతపురం జిల్లా కదిరిలో దారుణ హత్య జరిగింది. బెంగళూరుకు చెందిన షాబుద్దీన్ అనే పెయింటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. మెడపై బలమైన గాయం కావడం వల్ల షాబుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దుండగుల చేతిలో వ్యక్తి దారుణ హత్య - ananthapuram district kadiri
ఉన్న ఊరిని వదిలి పొట్టచేత బట్టుకుని అనంతపురం జిల్లా కదిరికి వచ్చాడు ఓ యువకుడు. అక్కడే వాహనాలకు పెయింటింగ్ వేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. వచ్చే ఆదాయంతో కడుపు నింపుకుంటున్నాడు. చివరికి దుండగుల చేతిలో దారుణహత్యకు గురయ్యాడు.
కదిరి సర్కిల్ ఇన్సెపెక్టర్ కార్యాలయం