పెళ్లికి అంగీకరించలేదని ప్రేమజంట ఆత్మహత్య అనంతపురం జిల్లా పాలవాయిలో విషాదం నెలకొంది. పెళ్లికి అంగీకరించలేదని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. అమ్మాయి మైనర్ అయినందువల్ల ఇంట్లో పెద్దవారు అడ్డుచెప్పినట్లు సమాచారం. మనస్థాపానికి గురై చెట్టుకు ఉరి వేసుకుని తనువు చాలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.