Lovers Suicide Attempt:అనంతపురం నగర శివారులోని ఉప్పారపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి, చిన్నకుంట గ్రామానికి చెందిన మహిళకు ఇటీవల పరిచయం ఏర్పడింది. కొద్ది కాలంలోనే పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కానీ వారువురికి అప్పటికే వేర్వేరుగా పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారు. వారి 'అనైతిక బంధాన్ని' సమాజం ఒప్పుకోదని తెలిసినా.. చాటు మాటుగా కలుసుకునేవారు.
వీరి వ్యవహారం తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు గట్టిగా మందలించారు. వారు చేస్తున్నది తప్పు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అవేవీ వారి చెవికెక్కలేదు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలు అంగీకరించలేదు. దీంతో.. ఇక ఎప్పటికీ కలిసి బతకలేమని, చావులోనైనా ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రేమ మైకంలో కళ్లు మూసుకుపోయి పవిత్రమైన పెళ్లి బంధాన్ని కాదనుకున్నారు. కన్న బిడ్డలనూ వద్దనుకున్నారు.