ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అడ్డొచ్చిన కులాలు.. ప్రేమ కథ విషాదాంతం

పట్టభద్రులు కావాల్సిన వారు..పుట్టెడు శోకం మిగిల్చారు.లక్ష్యం వైపు సాగాల్సిన వారు.. అనంతలోకాలకు చేరుకున్నారు. పుస్తక పాఠాలు చదవాల్సిన వారు.. ప్రేమ పాఠాలు తిరగేశారు. విజ్ఞాన వెలుగులు పొందాల్సిన వారు.. అజ్ఞాన చీకట్లలో చిక్కుకుపోయారు. భయంతో కలిసి చావాలనుకున్నారు.. కసితో గెలవాలనుకోలేదు.

lovers commites suicide at bathala palli
ప్రేమికుల ఆత్మహత్య

By

Published : Jul 23, 2020, 12:47 PM IST

అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దలు వివాహానికి అంగీకరించలేదని పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. బత్తలపల్లి మండలానికి చెందిన యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. యువకుడు ధర్మవరంలో డిగ్రీ చదువుతున్నాడు, అదే గ్రామానికి చెందిన యువతి ఇంటర్ చదువుతోంది.. వీరిద్దరూ బస్సులో రాకపోకలు చేస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. ఇరువురి ప్రేమ విషయం ఇద్దరి ఇళ్లల్లో తెలిసింది. కులాలు వేరుకావటంతో యువతికి వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు.

తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని బుధవారం ఉదయం ఇద్దరూ కలిసి వ్యవసాయ తోట వద్దకు వెళ్లి పురుగు మందు తాగారు. చికిత్స నిమిత్తం ఇద్దరిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యం పొందుతూ ఇద్దరూ మృతిచెందాడు. ఇద్దరి మృతదేహానికి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 65 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details