కరోనా నియంత్రణలో భాగంగా అధికారుల వ్యవహారశైలిపై ప్రజలు మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు.. 24 గంటల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు. దుకాణాలు, పాల డైరీలు సైతం మూసివేశారు. రోడ్డు పక్కన అమ్మకాలు జరిపే వారినీ పోలీసులు పంపించేశారు.
ఇక్కడి వరకూ బానే ఉంది కానీ... మద్యం షాపులు మాత్రం ఉదయమే తెరిచారు. విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. సంపూర్ణ లాక్ డౌన్ అని చెప్పి.. ఇదేంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుకాణాల వద్ద ఎవరూ భౌతిక దూరం పాటించకుండా.. గుంపులుగా ఎగబడుతూ కనీస జాగ్రత్తలు పాటించడం లేదని.. ఆందోళన వ్యక్తం చేశారు.