అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని రివర్స్ కాలనీ లో సుమారు ఐదేళ్ల కిందట ఏర్పాటుచేసిన బొరుగుల పరిశ్రమ ద్వారా వెలువడుతున్న కాలుష్యంతో.. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విచారణ అధికారికి ఈ విషయంపై మొరపెట్టుకున్నారు. ఈ పరిశ్రమ వల్ల నివాసాల చుట్టూ పొగ దట్టంగా అల్లుకుని ఉంటోందని.. ఫలితంగా ఆరోగ్యం పాడైపోతోందని చెప్పారు.
విచారణ నిమిత్తం వచ్చిన కాలుష్య నియంత్రణ అధికారి ఉస్మాన్ అలీ ఖాన్ దృష్టికి.. వారు పడుతున్న ఇబ్బందులను తీసుకెళ్లారు. నివాసాల మధ్య నుంచి పరిశ్రమలు తరలించాలని డిమాండ్ చేశారు. కాలనీవాసుల నుంచి వివరాలు సేకరించిన అధికారి రెండు నెలల్లో ఇక్కడి నుంచి పరిశ్రమను తరలించాలని యజమానికి సూచించారు. ప్రభుత్వ సూచనను పాటించని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.