అనంతపురం జిల్లా కదరి మండలంలోని కౌలేపల్లి వద్ద జాతీయ రహదారిని ఆనుకొని ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ విలువైన భూములను కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నంచగా, వారిని స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేరగా వారు అక్కడకు చేరుకుని కబ్జాదారులను వెనుదిరిగేలా చేశారు. ప్రభుత్వ భూమిలో పేదలకు పట్టాలు పంపిణీ చేయాలని స్థానికులు కోరారు.
ప్రభుత్వభూముల కబ్జాకు యత్నం..అడ్డుకున్న స్థానికులు - ananthapur
అనంతపురం కదిరిలో ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నించారు. గ్రామస్థులు వారిని అడ్డుకొని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
కబ్జా చేసేందుకు యత్నించిన వారిని అడ్డుకుంటున్న స్థానికులు