ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీగా క్యూ లైన్లు.. మద్యం కోసం ఆరాటపడుతున్న జనాలు - అనంతపురం జిల్లాలో లాక్​డౌన్ ప్రభావం

లాక్​డౌన్​తో రాష్ట్రవ్యాప్తంగా మూతబడ్డ మద్యం దుకాణాలు నేటి నుంచి కొన్ని షరతులతో తెరుచుకోనున్నాయి. ఫలితంగా అనంతపురం జిల్లాలో అనేక ప్రాంతాల్లో వైన్ షాపుల ముందు మద్యంప్రియులు బారులు తీరారు. అనంతపురం ఇంకా రెడ్​డోన్​లోనే ఉండటంతో అధికారులు నగరంలో మద్యం విక్రయాలను నిషేధించారు.

Liquor stores to open after a long break in ananthapuram district
సుదీర్ఘ విరామం అనంతరం తెరచుకోనున్న మద్యం దుకాణాలు

By

Published : May 4, 2020, 12:46 PM IST

రాష్ట్రంలో కొన్ని పరిమితులకు లోబడి నేటి నుంచి మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అనంతపురం జిల్లాలో దుకాణాల ముందు భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల వందల మీటర్ల మేర క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి.

అనంతపురం నగరం రెడ్​జోన్ పరిధిలో ఉన్న కారణంగా... ఎక్సైజ్ అధికారులు దుకాణాలకు అనుమతి ఇవ్వలేదు. నిబంధనలకు విరుద్ధంగా తెరచిన దుకాణాలను అధికారులు మూసివేయించారు. ఫలితంగా మద్యం ప్రియులు నిరాశకు లోనయ్యారు. కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాకే దుకాణాలు తెరుస్తామని అధికారులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details