ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసులకు అనంతపురం జిల్లా ఉరవకొండ లయన్స్ క్లబ్ సభ్యులు మాస్కులు, శానిటైజర్, ఫేస్ షీల్డ్ లు పంపిణీ చేశారు. కరోనా సెకండ్ వేవ్‌లో పరిస్థితి దారుణంగా ఉన్నా.. పోలీసులు ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. వారికి తమ వంతుగా ఈ వస్తువులు పంపిణీ చేశామని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని లయన్స్ క్లబ్ ఆదుకుంటుందని..కరోనా సమయంలో ఎంతో మందికి సహాయం అందిస్తుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్.ఐ రమేష్ రెడ్డి తెలిపారు.
పోలీసులకు మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ - Anantapur District news
ఉరవకొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసులకు మాస్కులు, శానిటైజర్స్, ఫేస్ షీల్డ్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల సేవలను వారు కొనియాడారు.
Lions Club representatives distribute safety items to police