చిరుత దాడిలో గుర్రం మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. కంబదూరు మండల కేంద్ర చివరలో ప్రేమ సాయి ఆశ్రమంలో పెంచుకుంటున్న గుర్రాన్ని చిరుత ఈడ్చుకుంటూకు వెళ్లి చంపి తినేసింది. ప్రేమ సాయి ఆశ్రమంలో పెంచుకుంటున్న ఒక గుర్రాన్ని కొండ ప్రాంతంలో ఉన్న చిరుత తీసుకెళ్లినట్లు రైతులు చెబుతున్నారు. కంబదూరు మండలం కేంద్రానికి సమీపంలో కొండల్లో ఉన్న చిరుత ఇటీవల రెండు పిల్లలకు జన్మనిచ్చి ఉంటుందని రైతులు తెలిపారు. దీంతో తాము వ్యవసాయ పనులకు వెళ్ళలేకపోతున్నామని.. అటవీశాఖ అధికారులు చిరుతను బంధించి ఇతర ప్రాంతాలకు తరలించాలని రైతులు కోరుతున్నారు.
చిరుత దాడిలో పెంపుడు గుర్రం మృతి.. - అటవీశాఖ
ఆశ్రమంలో పెంచుకుంటున్న గుర్రంపై చిరుత దాడిచేసిన సంఘటన అనంతపురం జిల్లా కంబదూరులో జరిగింది. అనంతరం వ్యవసాయ పొలాల్లోకి ఈడ్చుకెళ్లి చంపేసి తినేసింది. చిరుత భయంతో వ్యవసాయ పనులకు బయటకు వెళ్లలేక పోతున్నాం అంటూ.. స్థానిక రైతుల ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు చిరుతను బంధించి ఇతర ప్రాంతాలకు తరలించాలని రైతులు కోరుతున్నారు.
చిరుత దాడిలో పెంపుడు గుర్రం మృతి..