ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ... ముగ్గురికి తీవ్ర గాయాలు - అనంతపురంలో ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.

అనంతపురం జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి ఇటుక లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలుకాగా... ఇంట్లోని వారు సురక్షితంగా బయటపడ్డారు.

Larry crashed into the house
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

By

Published : Jun 25, 2021, 12:01 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో తృటిలో పెనుప్రమాదం తప్పింది. పైతోట వద్ద జాతీయరహదారిపై గురువారం అర్ధరాత్రి.. ఇటుకల లోడ్‌తో ఉన్న లారీ అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ సహా బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దెబ్బ తినగా.... అందులో ఉన్న 9 మంది సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details