అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మల్లాపురం కొండల్లో లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ పీఠాధిపతి రామమూర్తి స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి సుప్రభాత సేవ, గంగ పూజ, పంచామృత అభిషేకము, ఆకు పూజ, బంగారు, వెండి ఆవరణాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహా మంగళహారతి చేశారు.
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం - anantapuram latest news
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మల్లాపురంలో లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారిని అలంకరించిన ఆలయ పీఠాధిపతి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
lakshmi narasimha swamy
ప్రతి ఏటా వేలాది మంది భక్తజన సందోహం నడుమ జరిగే శ్రీవారి కల్యాణోత్సవం కరోనా కారణంగా ఆలయ ప్రధాన అర్చకులు, రుత్వికులు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది.
ఇదీ చదవండి:కదిరిలో వైభవంగా లక్ష్మీనరసింహస్వామి జయంతి