అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ పరిధిలోని ఆరవ వార్డులో నీటి సమస్య తీర్చాలని.. మహిళలు ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయంలో బైఠాయించారు. తమ కాలనీలో ఉన్న నీటి సమస్యను పరిష్కరించమని ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా అధికారులు పట్టించుకోలేదని మహిళలు ఆరోపించారు. అధికారుల తీరుతో విసుగెత్తి.. ఆందోళన చేపట్టామని.. ఇప్పటికైనా స్పందించి, నీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు కోరారు.
మున్సిపల్ కార్యాలయంలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన
నీటి సమస్యను తీర్చాలంటూ మున్సిపల్ కార్యాలయంలో ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళనకు దిగారు. ఈ ఘటన అనంతపురం జిల్లా మడకశిరలో జరిగింది.
మున్సిపల్ కార్యాలయంలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన