అనంతపురం వజ్రకరూరు మండలంలో విత్తనాల పంపిణీ కేంద్ర వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఓ వైపు అధికారులు విత్తన కొరత లేదని చెబుతున్నా పంపీణీ మాత్రం సరిపడినంతా జరగడంలేదని వాపోతున్నారు. తామంతా ఉదయమే పంపిణీ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నా... టోకెన్లు అయిపోయాయని మాటతో ఆగ్రహం వ్యక్తం చేశారు.. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రోడ్లపై బైఠాయించి, వ్యతిరేక నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమింపచేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. సమయం కాని సమయంలో విత్తనాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు.... దయచేసి మాకు తొందరగా విత్తనాలు పంపిణీ చేయండంటూ అన్నదాతలు కోరుకుంటున్నారు.
రాత్రి పగలు పడిగాపులు కాస్తున్నాం... విత్తనాలు ఇప్పించండయ్యా....! - lack of seeds
విత్తులేనిదే పంట లేదు...అదీ సరైన సమయంలో వేస్తేనే పంట చేతికొస్తుంది.... అలాంటి విత్తనం కోసం రాత్రి పగలు పడిగాపులు కాసినా అందని పరిస్థితుల్లో అనంతపురంలోని వజ్రకరూరు రైతులు ఆందోళన చెందుతున్నారు.
విత్తనాల కోసం రైతుల ఆందోళన