అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం వేపరాల ప్రాంతంలో ఉపాధి హామీ కూలీలు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న క్షేత్రసహాయకుడు తమకు అనుకూలమైనవారికి పనులకు రాకపోయినా మస్టర్ వేస్తున్నారని, ఆధారాలతో సహా ఏపీవో దృష్టికి తీసుకొచ్చారు. జాబ్ కార్డులు ఉన్నప్పటికీ పనులు కల్పించడంలో ఒక్కొక్కరికి ఒక్కో రీతిలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
క్షేత్రసహాయకుడిపై చర్యలు తీసుకుని అందరికీ పనులు చూపాలని కూలీలు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకు భాజపా నాయకులు కేశవరెడ్డి, శ్వేతారెడ్డి అక్కడికి చేరుకుని కూలీల విషయంలోనూ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పనిచేస్తున్న వారికి మాత్రమే మస్టర్ ఉండాలని, అవకతవకలకు పాల్పడితే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కూలీలకు అండగా భాజపా ఉంటుందని తెలిపారు.