ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బెంగళూరు టు గోరాపూర్.. కాలినడకన వలస కూలీలు - అనంతపురంలో వలస కార్మికులు

లాక్​డౌన్ తో వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. బెంగళూరు నుంచి గోరాపూర్ కు 2వందల మంది కార్మికులు కాలినడకన బయలుదేరారు. ప్రస్తుతం అనంతపురం చేరుకున్న కార్మికులు తమ ఇబ్బందులను ఈటీవీ భారత్ తో పంచుకున్నారు.

labors walking
labors walking

By

Published : May 12, 2020, 6:47 PM IST

లాక్ డౌన్ వేళ వలస కూలీలకు ఇబ్బందులు తప్పడం లేదు. బెంగళూరు నుంచి 200 మంది వలస కార్మికులు గోరాపూర్ వెళ్లడానికి కాలినడకన బయలుదేరారు. ఇవాళ అనంతపురం చేరుకున్నారు. లాక్ డౌన్ లో పడుతున్న ఇబ్బందులను ఈటీవీ భారత్​తో పంచుకుని ఆవేదన చెందారు.

వారికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేశాయి. కూలీలు కొందరు లారీలు ఇతర వాహనాల పైకెక్కి సొంత ఊళ్లకు బయలుదేరుతున్నారు. మహిళలు చిన్నపిల్లలను వెంటబెట్టుకొని ఎండను లెక్క చేయకుండా కాలినడకన స్వస్థలాలకు బయలుదేరారు.

పొట్టకూటి కోసం వలస వెళ్లిన కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాల్సింది పోయి.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ప్రభుత్వ వాహనాల్లో కూలీలను స్వస్థలలకు చేర్చాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 33 కరోనా కేసులు...ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details