ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంతకల్లులో కన్నుల పండువగా కుబేర లక్ష్మీ పూజ - hindhu

గుంతకల్లులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కుబేర లక్ష్మీ పూజా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ పూజ నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

గుంతకల్లులో కన్నుల పండువగా కుబేర లక్ష్మీ పూజా

By

Published : Aug 28, 2019, 7:23 PM IST

గుంతకల్లులో కన్నుల పండువగా కుబేర లక్ష్మీ పూజా

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలను అనావృష్టి, కరవు నుంచి రక్షించాలని ప్రార్థిస్తూ అనంతపురం జిల్లా గుంతకల్లులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కస్తూరిబా గాంధీ ఆర్యవైశ్య మహిళ మండలి అధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పూజలో 200 మంది వరకూ భక్తులు పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీ అమ్మవారికి పాలాభిషేకం చేశారు. కుబేర లక్ష్మీ పూజ వల్ల అష్ఠైశ్వర్యాలు సిద్ధిస్తాయని, పేదరికం కనుమరుగు అవుతుందని అర్చకులు అభిప్రాయపడ్డారు. చెడు ప్రభావాలు, దోషాలు తొలిగి...ప్రజలు సకల సంపదలతో వర్ధిల్లుతారని ఆలయ అర్చకుడు సుబ్రమణ్యం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details