అమరవీరులకు నివాళి - STUDENTS
జమ్మూకశ్మీర్ ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరలని ప్రజాసంఘాలు,విద్యార్థులు కొవ్వుత్తులతో ప్రదర్శనలు చేశారు.
కొవ్వుత్తులతో ప్రదర్శనలు
అనంతపురం జిల్లా కదిరిలో ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు కొవ్వుత్తులతో ర్యాలీ నిర్వహించారు. సైనికులపై ఉగ్రవాదుల అఘాయిత్యాన్ని నిరసిస్తూ ప్రదర్శనలు చేశారు. జవాన్ల ఆత్మకు శాంతికి కలగాని ప్రార్థనలు చేశారు. ఎన్జీవో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు,రోటరీ క్లబ్ ప్రతినిధులు, విద్యార్థులు రోడ్లపై ఉగ్రవాదుల దిష్టి బొమ్మలను దహనం చేసి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.