కేరళాకు చెందిన సత్యసాయి భక్తులు, ఓనం వేడుకలను ఏటా అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకలకు వేలాది మంది కేరళీయులు పుట్టపర్తికి చేరుకున్నారు. తిరువనంతపురంకు చెందిన సాయి భక్తులు, సాయికుల్వంత్ మందిరంలో కృష్ణయానం నాటికను ప్రదర్శించారు. శ్రీకృష్ణుని బాల్యం నుంచి జరిగిన అంశాలను నాటిక రూపంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అనంతరం శ్రీకృష్ణుని, సత్యసాయినీ కీర్తిస్తూ భక్తి గీతాలను ఆలపించారు. ఓనం వేడుకల్లో భాగంగా కేరళీయులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
'ఓనం వేడుకల్లో ఆకట్టుకున్న కేరళీయుల సాంస్కృతిక కార్యక్రమాలు' - అనంతపురం జిల్లా
ఓనం వేడుకల్లో భాగంగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కేరళీయులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకర్షించాయి. వేడుకలను వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
'ఓనం వేడుకల్లో ఆకట్టుకున్న కేరళీయుల సాంస్కృతిక కార్యక్రమాలు'