ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక దీపోత్సవం - balakrishna latest news

లోక కల్యాణార్థం, తన నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం కార్తీక మాసం సందర్భంగా హిందూపురంలో ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా మహిళలు హాజరయ్యారు.

bala krishna

By

Published : Nov 25, 2019, 11:20 PM IST

బాలయ్య ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. బాలకృష్ణతో పాటు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి.. ఎమ్మెల్సీ నారా లోకేష్, నందమూరి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీపోత్సవంలో పాల్గొనేందుకు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లోక కల్యాణార్థం, హిందూపురం ప్రజల శ్రేయస్సు కోసం కార్తీక మాసం సందర్భంగా బాలకృష్ణ ఈ దీపోత్సవం నిర్వహించారు. హిందూపురంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ ఆధ్యాత్మిక వేడుక జరిగింది. ముందుగా నందమూరి కుటుంబ సభ్యులంతా కలసి గణపతి పూజ చేశారు. అనంతరం రుద్రాభిషేకం నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు, భక్తిగీతాల నడుమ కార్యక్రమం ఆద్యంతం ఆధ్యాత్మికత పంచింది.

ABOUT THE AUTHOR

...view details