అనంతపురంలో పోలీసులు భారీగా కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. రాయదుర్గం పట్టణ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసులను గమనించిన నిందితులు కారును అక్కడే వదిలేసి పారిపోయారు. పోలీసులు కారును తనిఖీ చేయగా..1,344 మద్యం ప్యాకెట్లు, 1500 గుట్కా ప్యాకెట్లు లభించాయి.
కర్ణాటక రిజిస్ట్రేషన్ గల కేఏ 19 ఎంఎఫ్ 1115 నంబరు గల కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.