ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ బస్సులో కర్ణాటక మద్యం తరలింపు పట్టివేత - ananthapur district latest news

కర్ణాటక సరిహద్దు పావుగడ నుంచి అనంతపురం జిల్లాలోని పెనుగొండకు ఆర్టీసీ బస్సులో కర్ణాటక మద్యం తరలిస్తున్న యువకుడిని రొద్దంకి పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇతని వద్ద నుంచి 96 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

karnataka liquor seized and a person caught in ananthapur district police
ఏపీఎస్​ఆర్టీసీలో కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్​

By

Published : Jul 20, 2020, 5:37 PM IST

ఆర్టీసీ బస్సులో కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని రొద్దంకి పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లా పావుగడ-పెనుకొండ ప్రధాన రహదారిపై​ పోలీసులు వాహన తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో పెనుగొండ మండలం గుట్టూరు గ్రామానికి 96 కర్ణాటక మద్యం సీసాలు తరలిస్తున్న జయ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. మద్యం సీసాలను సీజ్​ చేసి నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నారాయణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details