Kalava Srinivasulu Comments On YCP Government: మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన అన్యాయానికి గురయ్యారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గం వినాయక సర్కిల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు 70 వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వ్యాపారులతో కలిసి "ఇదేమి ఖర్మ" కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయమే: కాలవ శ్రీనివాసులు - Details of the traders who lost
Kalava Srinivasulu Comments On YCP Government: బెదిరింపులు, ప్రలోభాలు, పన్నుల బాదుడుతో.. రాష్ట్రంలోని వ్యాపారస్తులు ఆర్థికంగా చితికిపోయారని టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. అన్ని వర్గాల వారికి తెలుగుదేశం పార్టీ మాత్రమే సమన్యాయం చేస్తుందని ఆయన అన్నారు.
కాలవ శ్రీనివాసులు
ప్రధాన రహదారిలో ఉన్న వ్యాపారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నా కాలవ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రచురించిన కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో పేదలకు, వ్యాపారస్తులకు అండగా ఉండేది.. తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఆయన గుర్తుచేశారు. అందుకనే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఎంతో అవసరముందని కాలువ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: