అధికార వైకాపా.. తాడిపత్రి మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికను బహిష్కరించటం సిగ్గుచేటని తెదేపా నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెదేపాకు 19 మంది కౌన్సిలర్లు ఉన్నా..స్వతంత్య్ర అభ్యర్థికి వైస్ ఛైర్మన్ పదవి కట్టబెట్టామన్నారు. కౌన్సిలర్లను బెదిరించాలని అధికార పార్టీ ప్రయత్నించినా..కుదరలేదని జేసీ ఆరోపించారు. అధికారంలో ఉండి కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించటం పెద్ద తప్పిదమన్నారు.
జిల్లాలో ఫ్యాక్షన్ సంస్కృతి అంతరించింపోయిందని.., ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రైవేటు సైన్యంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రైవేటు సైన్యంతో ఆధిపత్యం చెలాయిస్తామంటే తాడిపత్రిలో కుదరదన్నారు.