ప్రధాని మోదీ చెబితే జగన్ వింటారేమో..!: జేసీ - ప్రధాని మోదీ చెబితే జగన్ వింటారేమో: జేసీ దివాకర్‌రెడ్డి
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కొనసాగించాలని హైకోర్టు చెప్పినా జగన్ పట్టించుకోవట్లేదని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి విమర్శించారు. హైకోర్టు ఉత్తర్వులను కూడా సీఎం లెక్కచేయట్లేదని మండిపడ్డారు.
ప్రధాని మోదీ చెబితే జగన్ వింటారేమో: జేసీ దివాకర్‌రెడ్డి
ముఖ్యమంత్రి జగన్ హైకోర్టు ఉత్తర్వులను కూడా లెక్కచేయట్లేదని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో మాజీ సీఎం నీలం సంజీవరెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఆయన...ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కొనసాగించాలని చెప్పినా జగన్ పట్టించుకోవట్లేదన్నారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న జగన్ నిర్ణయం సరైంది కాదన్నారు. ప్రధాని మోదీ చెబితే జగన్ వింటారేమోనని ఎద్దేవా చేశారు.