'ప్రజల పట్ల చంద్రబాబు బాధ్యతకు నా సెల్యూట్' - chandra babu
చంద్రబాబు నాయుడితో నాకు చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన విజన్‌కి సెల్యూట్. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి: జేసీ దివాకర్
జేసీ దివాకర్ రెడ్డి
By
Published : Apr 2, 2019, 7:00 AM IST
చంద్రబాబుపై జేసీ ప్రశంసల జల్లు
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు మాత్రమే అభివృద్ధి చేయగలరని అనంతపురం తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా ఏపీ అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, నిరుపేదల పట్ల చంద్రబాబుకు ఉన్నబాధ్యతకు తాను సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. చంద్రబాబుతో తనకు భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ... ఇన్ని పథకాలు, ఇంత దూరదృష్టి కలిగిన నేతను తన రాజకీయ జీవితంలో చూడలేదని అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో తెదేపా తరఫున ప్రచారంలో పాల్గొన్న ఆయన... సీఎం చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు.