అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో పేదల గుడిసెలను రెవిన్యూ అధికారులు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ పోరాటానికి దిగింది. బాధితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న డిమాండ్‌తో బుక్కరాయ సముద్రం తహశీల్దార్ కార్యాలయం ఎదుట మూడో రోజూ సీపీఐ రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. ప్రభుత్వం ఉగాదికి పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రకటనలు చేస్తుంటే... రెవిన్యూ అధికారులు మాత్రం పేదలు వేసుకున్న గుడిసెలు తొలగిస్తున్నారని మండిపడ్డారు. 3 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఇవేం చర్యలని మండిపడ్డారు.
'పేదల గూడును తొలగించడం అన్యాయం'
పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా... రెవిన్యూ అధికారులు మాత్రం పేదల నివాసాలను తొలగిస్తున్నారని సీపీఐ అనంతపురం జిల్లా నేతలు విమర్శించారు. బుక్కరాయసముద్రంలో గుడిసెలను తొలగించడం దారుణమన్నారు.
'It is unfair to remove the houses of the poor people' says cpi