ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పూల మాలలు, గోవింద నామాలతో వినూత్న నిరసన - protest in kadiri

మూడు రాజధానుల నిర్ణయంపై అనంతపురం జిల్లా కదిరిలో నిరసనలు కొనసాగాయి. పూలమాలలు వేసుకొని, గోవింద నామాలతో వినూత్నంగా ఆందోళన చేశారు నిరనసకారులు.

innovative-protest-with-flower-names-govinda-names
పూలమాలలు, గోవింద నామాలతో వినూత్న నిరసన

By

Published : Feb 6, 2020, 6:37 PM IST

పూలమాలలు, గోవింద నామాలతో వినూత్న నిరసన

రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి నిరసనలు కొనసాగుతున్నాయి. పూలమాలలు వేసుకుని, గోవిందనామాలతో వినూత్నంగా నిరసన చేపట్టారు. పట్టణంలోని ఎన్టీఆర్ కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ హిందూపురం రహదారి మీదుగా శ్రీ కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు సాగింది. ముఖ్యమంత్రి మనసు మార్చాలని నరసింహస్వామిని ఆందోళనకారులు వేడుకున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల ఆలోచనను విరమించుకునేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని పరిరక్షణ సమితి సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

పెళ్లై 4 నెలలే.. అంతలోనే దంపతుల ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details