రోడ్డు ప్రమాదం జరిగిందని ఘటనా స్థలం వద్ద ప్రజలు గూమికూడారు. ప్రమాదంలో గాయపడి నెత్తురోడుతున్న యువకుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు మాత్రం ముందుకు రాలేదు. ఈ ఘటన అనంతపురం జిల్లా నల్లచెరువు వద్ద జరిగింది.
నెత్తురోడుతున్నా... సాయం చేసేందుకు ముందుకు రాలేదు!
ప్రమాదం జరిగిందని చుట్టూ పదుల సంఖ్యలో ప్రజలు గూమికూడారే గానీ.. గాయపడి నొప్పితో విలవిల్లాడుతున్న యువకుడిని మాత్రం ఆసుపత్రికి తరలించేందుకు ముందుకు రాలేదు. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లా నల్లచెరువు వద్ద జరిగింది.
గాయపడిన వ్యక్తి
నల్లచెరువు రహదారిపై ద్విచక్ర వాహనాన్ని అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఆ అంబులెన్స్‌లో కరోనా మృతదేహాన్ని తరలిస్తున్నారని… యువకుడికి సాయం చేసేందుకు ప్రజలెవ్వరూ ముందుకు రాలేదు. మరొక అంబులెన్స్ వచ్చినా.. శివకుమార్‌ని అంబులెన్స్‌లోకి ఎక్కించేందుకు స్థానికులు ముందుకు రాలేదు. దీంతో 108 సిబ్బందే స్ట్రెచర్‌పై ఆ యువకుడిని అంబులెన్స్‌లోకి ఎక్కించారు.