ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Lock to Offices: అద్దె చెల్లించలేదని.. సచివాలయాలకు తాళాలు

Village Secretariats Locked: అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంలో సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో సచివాలయాల సిబ్బంది సేవలు నిర్వహిస్తున్నారు. అయితే గత రెండున్నరేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో సచివాలయాలకు యాజమానులు తాళం వేశారు.

By

Published : Mar 22, 2022, 8:03 AM IST

Published : Mar 22, 2022, 8:03 AM IST

Village Secretariats Locked
అద్దె చెల్లించకపోవడంతో సచివాలయాలకు తాళాలు

Village Secretariats Locked: అద్దె చెల్లించకపోవడంతో సచివాలయాలకు తాళం వేసిన ఘటన అనంతపురం జిల్లాలో బెళుగుప్ప మండలంలో చోటు చేసుకుంది. సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో సచివాలయా సిబ్బంది సేవలు నిర్వహిస్తున్నారు. బెళుగుప్ప మండలంలోని ఎర్రగుడి, బెళుగుప్ప- 2 సచివాలయాలకు గత రెండున్నరేళ్లుగా సుమారు రూ 2.85 లక్షల అద్దె చెల్లించలేదు. అధికారులను పలుమార్లు అడిగినా పట్టించుకోకపోవడంతో సోమవారం సంబంధిత భవనాలకు యజమానులు తాళం వేశారు.

అధికారులు యజమానులతో మాట్లాడిన తర్వాత ఎర్రగుడి సచివాలయంలో మధ్యాహ్నం నుంచి సచివాలయ సేవలు ప్రారంభమయ్యాయి. బెళుగుప్ప-2లో మాత్రం పూర్తిగా ఒకరోజు సేవలు నిలిచిపోయాయి. దీనిపై గ్రామీణాభివృద్ధి కార్యనిర్వహక అధికారి నాగేశ్వరశాస్త్రిని వివరణ కోరగా త్వరలోనే అద్దె చెల్లించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details