ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా వైరస్​పై గుంతకల్లులో హిజ్రాల అవగాహన

గుంతకల్లులో కరోనా వైరస్​ ప్రభావంపై వాహనదారులకు హిజ్రాలు అవగాహన కల్పించారు. వైరస్ దరి చేరకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో హిజ్రాలతో కొవిడ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు ప్రచారం కల్పించారు.

By

Published : Jul 20, 2020, 5:28 PM IST

hijras awareness
కరోనా వైరస్​పై గుంతకల్లులో అవగాహన కల్పిస్తున్న హిజ్రాలు

కరోనా వైరస్​పై గుంతకల్లులో అవగాహన కల్పిస్తున్న హిజ్రాలు

అనంతపురం జిల్లా గుంతకల్లులో ఎన్​ఫోర్స్​మెంట్ సిబ్బంది వినూత్నంగా అలోచించారు. కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు హిజ్రాలతో ప్రచారం కల్పించారు. ప్రధాన కూడళ్లలో రోడ్లపై వాహనదారులను ఆపి వారికి అవగాహన కల్పించారు.

వైరస్ వ్యాప్తి నుంచి దూరంగా ఎలా ఉండాలి, వైరస్ దరిచేరకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో హిజ్రాలతో వివరింపజేశారు. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా వేళల్లో బయటకు రావొద్దని కోరారు.

ABOUT THE AUTHOR

...view details