ధర్మవరంలో సినీ నటి ప్రణిత సందడి చేశారు. ఓ వస్త్ర దుకాణ ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యారు. ప్రణితను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు, ప్రజలు తరలివచ్చారు.
నటి ప్రణిత
By
Published : Mar 27, 2019, 6:02 PM IST
హీరోయిన్ ప్రణిత
అనంతపురం జిల్లా ధర్మవరంలో సినీ నటి ప్రణిత సందడి చేశారు. పట్టణంలోని నేసేపేటలో పట్టు వస్త్రాల దుకాణ ప్రారంభోత్సవానికి ఈ ముద్దుగుమ్మ హాజరయ్యారు. ధర్మవరం పట్టు చీరలు మగువల మనసు దోస్తున్నాయని.... చేనేత కార్మికులు పట్టు చీరలను ఎంతో నైపుణ్యంతో తయారు చేయడం అభినందనీయమని ఆమె అన్నారు. ఈ టాలీవుడ్ భామతో స్వీయచిత్రాలు తీసుకునేందుకు మహిళలు,యువకులు పోటీ పడ్డారు.