ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షం.... అతలాకుతలం - ananthapur district latest rainfall news

అనంతపురంలో గురువారం పడిన వర్షానికి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. విద్యుత్​ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. పార్కింగ్​ వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

heavy storm and rainfall leads to loss of properties for gutti people
ఈదురుగాలులతో పడిన వర్షానికి తీవ్ర ఆస్తి నష్టం

By

Published : May 8, 2020, 1:31 PM IST

అనంతపురం జిల్లా గుత్తిలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పట్టణంలోని విద్యుత్​ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలుచోట్ల రోడ్ల పక్కనున్న నేమ్​ బోర్డులు, పైకప్పులు ఊడిపడ్డాయి. దాదాపు 10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు చెబుతున్నారు. దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

ఈదురుగాలులతో పడిన వర్షానికి తీవ్ర ఆస్తి నష్టం

ABOUT THE AUTHOR

...view details