ఇటీవల కురిసిన వర్షాలతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చెరువులు,కుంటలు జలకళను సంతరించుకున్నాయి.బ్రహ్మసముద్రం,కంబదూరు మండలాల్లో అధిక వర్షపాతం కురవడంతో హగరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 20ఏళ్ల తర్వాత జిల్లాలో పెద్ద చెరువులో సగానికిపైగా నీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి చెరువు పూర్తిగా నిండిపోయి నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది.దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు.చెలిమే పల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి నీరు చేరింది.గుండిగాని పల్లి సమీపంలో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది.శెట్టూరు మండలం అయ్యగార్ల పల్లి గ్రామ శివార్లలో వాగులో పడి ఆవు చనిపోయింది.
అనంతపురంలో భారీవర్షాలు..రాకపోకలకు అంతరాయం - అనంతపురంలో భారీవర్షం
నాలుగు రోజులనుండి కురుస్తున్న భారీవర్షాలతో కళ్యాణదుర్గం నియోజక వర్గంలో చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
heavy rain fall in ananthapuram