అనంతపురంలో కార్డియాలజీ సొసైటీ ఆధ్వర్యంలో గుండెజబ్బుల రకాలు, అత్యాధునిక వైద్య చికిత్స విధానాలపై వర్క్‌షాప్ నిర్వహించారు. కిమ్స్ డైరెక్టర్ డా.భాస్కరరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామాల్లో కన్నా పట్టణాల్లోనే గుండెజబ్బు బాధితుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు.19 ఏళ్ల క్రితం 27 శాతం మంది గుండెజబ్బులతో మృత్యువాత పడ్డారని... ప్రస్తుతం ఆ సంఖ్య 32 శాతానికి పెరిగిందన్నారు. గుండె జబ్బులపై ప్రతిఒక్కరూ సరైన అవగాహన ఉంటే మృత్యువును పదేళ్లపాటు జయించొచ్చని తెలిపారు.
పట్టణాల్లోనే గుండె జబ్బులు ఎక్కువ: కిమ్స్ డైరెక్టర్ - గుండెజబ్బులు
గ్రామాల్లో కన్నా పట్టణాల్లోనే గుండె జబ్బు బాధితులు ఎక్కువగా ఉన్నారని కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ భాస్కరరావు తెలిపారు. గుండె జబ్బులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
గుండె జబ్బులపై అవగాహన కల్పిస్తున్న కిమ్స్ డైరెక్టర్ డా. భాస్కరరావు