అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని గుడ్డం రంగనాథ స్వామి ఆలయ రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఏటా కార్తీక మాసం రెండో ఆదివారం రోజున రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం నుంచి హోమాలు నిర్వహించిన అనంతరం.. ప్రత్యేక పూలతో అలంకరించిన ఉత్సవమూర్తులను రథంలో ఉంచి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. వందలాది మంది మహిళలు రథోత్సవంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
కన్నుల పండువగా రంగనాథ స్వామి ఆలయ రథోత్సవం - Chariot Festival at hindupuram in anantahpur district
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని గుడ్డం రంగనాథ స్వామి ఆలయ రథోత్సవం... కోలాహలంగా జరిగింది. ప్రత్యేక పూలతో అలంకరించిన ఉత్సవమూర్తులను రథంలో ఉంచి ఆలయం చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు.
కన్నుల పండువగా గుడ్డం రంగనాథ స్వామి ఆలయ రథోత్సవం