అనంతపురం జిల్లాలో వేరుశనగ రాయితీ విత్తనాల పంపిణీలో అధికారుల ప్రణాళికా లోపంతో రైతులు అవస్థలు పడ్డారు. జిల్లాలోని తలుపుల మండలంలో విత్తన పంపిణీ చేపట్టారు. మండలం మొత్తం ఒకేరోజు పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. అయితే అందుకు తగ్గట్లు సరైన ఏర్పాట్లు చేయలేదు. విత్తనాల కోసం రైతులు మండుటెండలో నిలబడ్డారు. వారికి కనీసం తాగునీటి వసతి కూడా కల్పించలేదు. వచ్చిన రైతులకు టోకెన్లు ఇచ్చేందకు తగినంత సిబ్బంది లేదు. దీంతో వారు గంటల తరబడి వరుసలో నిలబడాల్సి వచ్చింది. విత్తన పంపిణీ నిలిపేస్తారనే సమాచారం తోపులాటకు దారితీసింది. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపుచేశారు.
విత్తన పంపిణీలో నిర్లక్ష్యం.. రైతులకు శాపం
అనంతపురం జిల్లా తలుపుల మండలంలో చేపట్టిన వేరుశనగ రాయితీ విత్తనాల పంపిణీలో గందరగోళం చోటుచేసుకుంది. అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదంటూ రైతులు వాగ్వాదానికి దిగారు.
వేరుశెనగ విత్తన పంపిణీ.. రైతుల అవస్థలు